అమరావతిపై ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ - Referendum by voting on Amravati
close
Updated : 26/08/2020 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరావతిపై ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ

ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించిన తెదేపా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై ప్రజాభిప్రాయం కోరదామని తాము విసిరిన సవాల్‌ను వైకాపా ప్రభుత్వం స్వీకరించకపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరారు. www.apwithamaravati.com పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధితోపాటు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారా? అనే ప్రశ్నను అందులో ఉంచారు. వెబ్‌సైట్‌ ద్వారా ఓటు వేసి అమరావతిని రక్షించుకోండి అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ వెబ్‌సైట్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 36 గంటల వ్యవధిలోనే 3లక్షల మందికి పైగా ప్రజలు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వీరిలో 90 శాతం మందికి పైగా ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ఉండాలని స్పష్టం చేశారు. 

అమరావతి పేరు ఘన చరిత్రతో ముడిపడి ఉంది..
అమరాతి చరిత్ర, రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను చంద్రబాబు ఆ వెబ్‌సైట్‌లో స్పష్టంగా వివరించారు. అమరావతి ఆంధ్రరాష్ట్రానికి కేంద్ర బిందువని  వెల్లడించారు. రాష్ట్రానికే కాకుండా దేశానికే అభివృద్ధి కేంద్రంగా చేయాలనే భవిష్యత్తు లక్ష్యంతో.. మూడు మెగా సిటీలు, 14 స్మార్ట్‌ సిటీలతో మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతుందనే ఆశాభావంతో రూపొందించామన్నారు. వినూత్నమైన ల్యాండ్‌ పూలింగ్‌ పథకంతో 26,839 మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. అమరావతి అనే పేరు ఘన చరిత్రతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమరావతికి సంబంధించిన ఫొటోలు, పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని