పెళ్లి సందడి హీరోయిన్‌ ఈమేనా..? - Srikanths son Roshan to play the lead in the sequel of Pelli Sandadi
close
Published : 29/10/2020 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి సందడి హీరోయిన్‌ ఈమేనా..?

హైదరాబాద్‌: శ్రీకాంత్‌ కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘పెళ్లి సందడి’. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియుల హృదయాలను కొల్లగొట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ‘పెళ్లి సందడి’ పేరుతో ఓ చిత్రాన్ని రానున్నట్లు ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కథానాయకుడిగా శ్రీకాంత్‌-ఉహల తనయుడు రోషన్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాలో కథానాయికగా ఎవరు కనిపించనున్నారే విషయంలో ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది.

ఇందులో రోషన్‌కు జంటగా మాళవికా నాయర్‌ సందడి చేయనున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ‘పెళ్లి సందడి’ చిత్రంలో కథానాయిక పాత్ర ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని.. మాళవికా నాయర్‌ అయితే సదరు పాత్రకు న్యాయం చేయగలదని చిత్రబృందం భావించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా మాళవికా నాయర్‌ సైతం ‘పెళ్లి సందడి’లో నటించేందుకు ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈవిషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆర్కా మీడియా నిర్మాణంలో ఈ సీక్వెల్‌ రాబోతోంది. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చనున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని