అభిమానులను నిరాశకు గురిచేసిన సూర్య - Suriya postpones Soorarai Pottru OTT release promises trailer and updates soon
close
Updated : 24/10/2020 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానులను నిరాశకు గురిచేసిన సూర్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించే నటుడు సూర్య. ఆయన కథానాయకుడిగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అక్టోబర్‌ 30న ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు.  తాజాగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు సూర్య తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

‘‘ఆకాశం నీ హద్దురా’కు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) నుంచి ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) లభించలేదు. ఈ సినిమా కథ ఏవియేషన్‌ పరిశ్రమకు సంబంధించింది కావడంతో అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది జాతీయ భద్రతకు సంబంధించినది. ట్రైలర్‌తో సహా మరెన్నో విషయాలను మీకు త్వరలో వెల్లడిస్తాం. ఈ సినిమాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’అని చెప్పారు.

ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. చివరకు అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. థియేటర్‌లు మూసి ఉండటంతో ఓటీటీలో విడుదలవుతున్న మొదటి భారీ బడ్జెట్‌ చిత్రమిదే. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడైన జీఆర్‌. గోపీనాథ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అపర్ణ బాల మురళి, పరేష్‌ రావల్‌, మోహన్‌బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని