INPICS: NisChay వివాహ వేదిక చూసొద్దాం రండి..! - Take A Look On Niharika Wedding Venue Oberai UdaiVilas Palace
close
Published : 19/11/2020 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

INPICS: NisChay వివాహ వేదిక చూసొద్దాం రండి..!

ఆసియాలోనే ది బెస్ట్‌ హోటల్‌ ఇది..!

ఇంటర్నెట్‌డెస్క్‌: నిహారిక కొణిదెల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు మెగా కుటుంబం సిద్ధమయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె ఏడడుగులు వేసే క్షణం కోసం చిరు కుటుంబంలోని ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో తమ ఇంట్లో జరగనున్న మొదటి శుభకార్యం కావడంతో ఈ వివాహ వేడుక ప్రతి ఒక్కరికీ ఓ మధుర జ్ఞాపకంగా ఉండేలా నాగబాబు ఫ్యామిలీ ప్లాన్‌ చేసింది. ఈ మేరకు ఆసియాలోనే ది బెస్ట్‌ హోటల్‌గా పేరొందిన ఒబెరాయ్‌ ఉదయ్ ‌విలాస్‌ ప్యాలెస్‌ను నిహారిక-చైతన్య పరిణయ వేదికగా ఎంపిక చేసింది.

మరికొన్ని రోజుల్లో (డిసెంబర్‌ 9) వివాహం జరగనుండడంతో ఇప్పటికే నిహారిక-చైతన్య వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ కోసం ఉదయ్ ‌విలాస్‌ ప్యాలెస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిహారిక షేర్‌ చేసిన ఓ ఫొటోనే దానికి నిదర్శనం. ప్రపంచంలోనే ది బెస్ట్‌ ప్యాలెస్‌ హోటల్స్‌లో ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్న ఉదయ్‌విలాస్‌లో ఇటీవల ముఖేశ్‌ అంబానీ గారాల పట్టి ఈశా సంగీత్‌ వేడుక జరిగింది. ఈ క్రమంలో నిహారిక-చైతన్య పెళ్లి నేపథ్యంలో సదరు హోటల్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో ఒబెరాయ్‌ ఉదయ్‌ విలాస్‌ ప్యాలెస్‌ ఎలా ఉంటుందో చూడాలని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌కు సంబంధించిన సోషల్‌మీడియా అకౌంట్‌లో షేర్‌ చేసిన ఫొటోలు ఆధారంగా ఆ హోటల్‌ ఎలా ఉంటుందో చూసొద్దాం రండి..!















Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని