భయపడాల్సిన అవసరం లేదంటూ వీడియో షేర్ చేసిన నవ్య
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6లక్షలు దాటేసింది. సామాన్యుల నుంచి మంత్రులు, సినీ నటులు ఎవరూ దీనికి అతీతులు కారు. ప్రముఖ బుల్లితెర నటి నవ్య స్వామి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా పంచుకున్నారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఉండటమే ఎంతో ఉత్తమమని అన్నారు. ఒక వేళ వ్యాధి సోకినా భయపడాల్సిన అవసరం లేదన్నారు.
‘‘కరోనా సోకినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. సిగ్గు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇతరులు మాట్లాడే విమర్శలను పట్టించుకోకండి. నెగిటివిటీకి దూరంగా ఉండండి. వ్యాధి బారిన పడటం కన్నా ముందు జాగ్రత్త ఎంతో అవసరం. ఒకవేళ మీలో ఎవరైనా కరోనా పాజిటివ్ అని తెలిసినా విచారించాల్సిన అవసరం లేదు. దృఢంగా ఉండండి. స్వీయ గృహ నిర్బంధంలో ఉండండి. మీతోటి వారికి దూరంగా ఉండండి. అప్పుడే మార్పు సాధ్యం. మీ ప్రేమాభిమానాల వల్ల నేను బాగున్నా. త్వరలోనే మరింత దృఢంగా మీ ముందుకు వస్తా’’ అని పేర్కొన్నారు.
నవ్యతో పాటు ఇటీవల సీరియల్ షూటింగ్లో పాల్గొన్న ఇతర నటీనటులను సైతం ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉంచారు. నవ్య స్వామి తెలుగులో పలు సీరియల్స్‌తో పాటు, పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది