ప్రతి రైతుకూ ఎంఎస్‌పీ అందేలా చూస్తా - Till I am in Haryana govt MSP will be ensured for each farmer says Dushyant Chautala
close
Updated : 13/12/2020 04:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి రైతుకూ ఎంఎస్‌పీ అందేలా చూస్తా

 హరియాణా  డిప్యూటీ సీఎం దుష్యంత్‌

దిల్లీ: హరియాణా ప్రభుత్వంలో తాను ఉన్నంత వరకు ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందేలా చూస్తానని డిప్యూటీ సీఎం, జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా అన్నారు.  కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 17 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్రం వచ్చే 24గంటల నుంచి 40 గంటల్లో మరో దఫా  చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నానన్నారు. శనివారం ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికైతే హరియాణాలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం స్థిరంగానే ఉందని, మద్దతు ధర అంశంపై తాము స్థిరమైన వైఖరితో ఉన్నట్టు చెప్పారు.

జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) మద్దతుతో హరియాణాలో కట్టర్‌ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం మనుగడ సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రైతు వ్యతిరేక చట్టాలు చేసిన భాజపా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ పలు ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నుంచి జేజేపీపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే దుష్యంత్‌ చౌతాలా శనివారం ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ భేటీ అయ్యారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపు అంశం ప్రశ్నార్థకంగా మారితే తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు.

వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో 17 రోజులుగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఈ సమస్యను చర్చలు ద్వారానే పరిష్కరించి పరస్పర ఆమోదయోగ్యంతో దిల్లీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తదుపరి చర్చల్లో ఇరు వైపుల నుంచి సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి..

నాన్న ఇప్పటికీ టీ స్టాల్‌ నడుపుతున్నాడు!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని