Congress: రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల

ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 08 May 2024 14:49 IST

ఖమ్మం: ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు అండగా ఉంటుందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని వివరించారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని