అఫ్గానిస్థాన్‌లో పేలుళ్లు: 17 మంది మృతి - Two Blasts in Afghanistans Bamiyan
close
Published : 25/11/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఫ్గానిస్థాన్‌లో పేలుళ్లు: 17 మంది మృతి

కాబుల్‌‌: అఫ్గానిస్థాన్‌లోని బమియాన్‌ పట్టణంలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక వార్తాసంస్థల సమాచారం ప్రకారం బమియాన్‌ పట్టణంలోని మార్కెట్‌లో ఈ పేలుళ్లు జరిగాయి. దీనికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు. అఫ్గాన్‌లో బమియాన్‌ అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటి. ఇక్కడ పేలుళ్లు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ఏటా వేలమంది పర్యటకులు ఈ నగరాన్ని సందర్శించేందుకు ఇక్కడికి వస్తారు. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని