వచ్చే బర్త్‌డే ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో..: కమల్‌ - We shall celebrate my next birthday at Fort St George says kamal haasan
close
Updated : 10/11/2020 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే బర్త్‌డే ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో..: కమల్‌

చెన్నై: విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ శనివారం 66వ పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసుకున్నారు. అభిమానులతోపాటు శ్రేయోభిలాషులు ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో తనను విష్‌ చేసిన వారికి కమల్‌ ధన్యవాదాలు చెప్పారు. అంతేకాదు ‘నా తదుపరి పుట్టినరోజును ఫోర్ట్ సెయింట్ జార్జ్ (తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం)లో జరుపుకొందాం’ అని ప్రామిస్‌ చేసి, సర్‌ప్రైజ్ చేశారు.

‘నన్ను విష్‌ చేసిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకించి నా స్నేహితులకు, మీడియా సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ శుభాకాంక్షలు నా రోజును సంతోషంగా చేశాయి. నా బర్త్‌డేను సమాజ సేవ కోసం ఉపయోగించిన ‘మక్కల్‌ నీది మయ్యం’ కార్యకర్తలను చూసి సర్‌ప్రైజ్‌ అయ్యా. ఇలానే మీ సేవను కొనసాగించండి. మీ కృషికి, ప్రేమకు తగ్గ ఫలితం దక్కేందుకు ప్రయత్నిస్తానని వాగ్దానం చేస్తున్నా. నా తదుపరి పుట్టినరోజును ఫోర్ట్ సెయింట్ జార్జ్ వద్ద జరుపుకుందాం’ అని కమల్‌ వరుస ట్వీట్లు చేశారు.

వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేయడంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కమల్‌ తన పుట్టినరోజు నేపథ్యంలో అభిమానులకు శనివారం కానుక ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తర్వాతి సినిమా ‘విక్రమ్‌’ టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. మరోపక్క ఆయన ‘భారతీయుడు 2’లోనూ నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని