‘ఆచార్య’.. బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ - acharya teaser release date announced
close
Updated : 29/01/2021 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’.. బిగ్‌ అనౌన్స్‌మెంట్‌

టీజర్‌ విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 29న సాయంత్రం విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ మేరకు టీజర్‌ విడుదల తేదీని తెలియజేస్తూ బుధవారం ఓ సరికొత్త వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

‘డియర్‌ చిరు సర్‌.. ధర్మస్థలి తలుపులు జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు తెరుచుకోనున్నాయి.’ - కొరటాల శివ

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన కాజల్‌ కథానాయికగా సందడి చేయనున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ సిద్ధగా కీలకపాత్రను పోషిస్తున్నారు. చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన... ‘ఆచార్య’ పోస్టర్‌‌, భారీ ఆలయం సెట్‌, ఇటీవల విడుదల చేసిన సిద్ధ బ్యాక్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

ఆ మాటతో నాకెంతో భయమేసింది: ప్రదీప్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని