అజయ్‌ భూపతి దర్శకత్వంలో అఖిల్‌? - akhil next movie with ajay bhupathi
close
Updated : 23/04/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజయ్‌ భూపతి దర్శకత్వంలో అఖిల్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించి అఖిల్ స్టిల్స్ సైతం విడుదలయ్యాయి. అందులో అతడు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఓ చిత్రంలో అఖిల్‌ నటించనున్నాడట. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అఖిల్ - పూజాహెగ్డే  కలిసి జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 19న తెరపైకి రానుంది. మరోవైపు అజయ్‌ భూపతి ‘మహాసముద్రం’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తుండగా, అతిదిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని