చాలా ఫన్‌ మిస్‌ అవుతాను: వాణీ కపూర్‌ - akshay kumar bell bottom shoot completed
close
Published : 10/12/2020 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాలా ఫన్‌ మిస్‌ అవుతాను: వాణీ కపూర్‌

ముంబయి: అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఇందులో వాణీ కపూర్‌ నాయిక. లాక్‌డౌన్‌ తర్వాత విదేశాల్లో చిత్రీకరణ జరుపుకొన్న తొలి చిత్రంగా ‘బెల్‌బాటమ్‌’   నిలిచింది. దీని స్ఫూర్తితోనే పలు చిత్రాలు విదేశాల్లో చిత్రీకరణకు ధైర్యంగా ముందుకెళ్లాయి. ‘బెల్‌బాటమ్‌’ యూకే షెడ్యూల్‌ పూర్తయ్యాకా ముంబయిలో చిత్రీకరణ మొదలుపెట్టారు. తాజాగా అక్కడ చిత్రీకరణ పూర్తయింది. దీంతో సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు నాయిక వాణీ కపూర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా అక్షయ్‌తో ఉన్న ఓ ఫొటోను పంచుకుంది.

‘‘అక్షయ్‌సార్‌ మీరు చాలా గొప్ప వ్యక్తి. ఇన్ని రోజుల మీతో నా ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. మళ్లీ మనం కలుసుకునే వరకు చాలా ఫన్‌ మిస్‌ అవుతాను. ఈ     సినిమాను థియేటర్లలో చూడటానికి మేమందరం ఎంతో ఆత్రుతగా ఉన్నాం’’అని ఆ పోస్ట్‌లో రాసింది వాణి. రంజిత్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లారా దత్తా, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు పోషించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని