అక్షయ్‌ ‘ది ఎండ్‌’ వచ్చే ఏడాదే! - akshay kumar debut series the end likely to go on floors later this year
close
Published : 19/06/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ ‘ది ఎండ్‌’ వచ్చే ఏడాదే!

ముంబయి: వెండితెరపై సినిమాలు చేయడంతోనే సరిపెట్టాలనుకోవడం లేదు.. ఇంకా దానికి అదనంగా ఏదో చేయాలనుకుంటున్న చాలామంది నటులకు డిజిటల్‌ వేదికలు ఓ ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌లు వాళ్ల కలలకు రెక్కలు తొడుగుతున్నాయి. అందుకే చిన్న స్థాయి నటులు మొదలు భారీ తారల వరకూ వెబ్‌బాట పడుతున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో విజయాలు అందుకుంటూ నిత్యం ఐదారు సినిమాలతో బిజీగా ఉండే అక్షయ్‌కుమార్‌ వెబ్‌సిరీస్‌ చేయనున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే ‘ది ఎండ్‌’ పేరుతో వెబ్‌సిరీస్‌ను ప్రకటించారు. అనుకోని కారణాలు, తర్వాత కరోనా ప్రభావంతో ఇది సెట్స్‌పైకి వెళ్లలేదు. దీనిపై నిర్మాత విక్రమ్‌ మల్హోత్ర స్పష్టతనిచ్చారు. ఈ షో వచ్చే ఏడాది మొదలుకానుందని వెల్లడించారు. ‘‘కరోనా కారణంగా ‘హుష్‌ హుష్‌’ లాంటి సిరీస్‌లను మధ్యలోనే ఆపేశాం. త్వరలో మళ్లీ మొదలుపెడతాం. దీంతో పాటు అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న ‘ది ఎండ్‌’ షో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రారంభం కానుంది’’ అని చెప్పారు. ఈ వెబ్‌ షో కోసం అక్షయ్‌కి సుమారు రూ.90 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. అక్షయ్‌ నటించిన ‘సూర్యవంశీ’, ‘బెల్‌బాటమ్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని