‘అల వైకుంఠపురములో’ ఐదు ‘10 కోట్లు’ - allu arjun ala vykuntapram lo songs got new record with five 10 crores views songs
close
Published : 29/07/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల వైకుంఠపురములో’ ఐదు ‘10 కోట్లు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు సినిమా పాటలు హిట్‌ అని చెప్పాలంటే.. ఎన్ని కేసెట్లు అమ్ముడయ్యయో లెక్క చూసేవారు. ఆ తర్వాత సీడీలు వచ్చాక ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్లు చేసేవారు. ఇప్పుడు లెక్క మారింది... అంతా మిలియన్ల మీదే లెక్కేస్తున్నారు. యూట్యూబ్‌లో ఆ పాటకు ఎన్ని వ్యూస్‌ (వీక్షణలు) వచ్చాయి అనేదే కొలమానంగా మారింది.  అలాంటి కొలమానంలో ‘అల వైకుంఠపురములో’ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాలో ఐదు పాటలు వంద మిలియన్ల మార్కును దాటాయి.

ఈ సినిమాకు సంబంధించిన వివిధ ఫంక్షన్లలో చిత్రబృందం చెప్పినట్లు... సినిమాను ప్రజల వద్దకు తీసుకెళ్లింది... ప్రజలను సినిమాకు తీసుకొచ్చింది తమన్‌ సంగీతమే. అందుకే సినిమా పాటలు అన్ని వ్యూస్‌ సంపాదిస్తున్నాయి. అల్లు అర్జున్‌ చాలా గ్యాప్‌ తర్వాత చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్‌ చెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయం అందుకుంది. పూజా హెగ్డే అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

‘సామజవరగమన...’ ప్రమోషనల్‌ సాంగ్‌, ‘రాములో రాముల..’ ప్రమోషనల్‌ సాంగ్‌, ఫుల్‌ వీడియో సాంగ్‌, ‘బుట్టబొమ్మ... ’ పాటలు ఇప్పటికే 10 కోట్ల వ్యూస్‌ దాటగా... తాజాగా ‘సామజవరగమన...’ ఫుల్‌ వీడియో సాంగ్‌ 10 కోట్ల మార్కును దాటింది. ప్రస్తుతం ఏ పాటకు ఎన్ని వ్యూస్‌ వచ్చాయో చూడండి. (వీక్షణలు: 28/7/20 సా. 5 గం. వరకు)

‘సామజవరగమన...’ ప్రమోషనల్‌ సాంగ్‌ (19,91,49,251 వ్యూస్‌) 


‘రాములో రాముల...’ ప్రమోషనల్‌ సాంగ్‌ (29,37,32,758 వ్యూస్‌)


‘రాములో రాముల...’ ఫుల్‌ వీడియో  సాంగ్‌ (16,93,49,087 వ్యూస్‌)


‘బుట్ట బొమ్మ...’ ఫుల్‌ వీడియో  సాంగ్‌ (29,43,44,150 వ్యూస్‌)


‘సామజవరగమన...’ ఫుల్‌ వీడియో  సాంగ్‌ (10,03,97,407 వ్యూస్‌)

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని