Cinema News: నటుడిగా తొలి జ్ఞాపకాలు - ar murugadoss made his 1st appearance on screen in this popular tamil film
close
Published : 07/06/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నటుడిగా తొలి జ్ఞాపకాలు

చెన్నై: ‘గజని’, ‘తుపాకీ’, ‘సర్కార్‌’ వంటి విజయవంతమైన చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు వారికీ దగ్గరయ్యారు దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. ఆయనలో గొప్ప దర్శకుడే కాదు.. అద్భుతమైన నటుడూ ఉన్నారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సెవెన్త్‌ సెన్స్‌’, ‘తుపాకి’, ‘సర్కార్‌’ వంటి సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసి మురిపించారు. అయితే ఆయన నటుడిగా తొలిసారి తెరపై కనిపించిన సినిమాకి సంబంధించిన ఓ అపురూప వీడియోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆయన్ని నటుడిగా తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఉదయశంకర్‌. ఆయన అబ్బాస్‌, సిమ్రాన్‌ల జంటతో తెరకెక్కించిన చిత్రం ‘పూచుదవ’ (1997). తెలుగులో ‘పెళ్లి కల వచ్చేసిందే బాలా’ పేరుతో విడుదలైంది. ఈ సినిమాకి మురుగదాస్‌ సంభాషణలు రాశారు. అంతేకాదు ఈ చిత్రంతోనే నటుడిగా తెరంగేట్రం చేశారు. ఇది ఎవరికీ తెలియదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియోలో తను నటించిన సన్నివేశం చూపించారు. ఈ సీన్‌లో ఆయన సర్వర్‌గా కనిపించారు. ఈ సన్నివేశంలో నగేష్‌ ‘నీ పేరేంటి’ అని ప్రశ్నించగా.. ‘మురుగదాస్‌’ అని బదులివ్వడం కనిపించింది. ప్రస్తుతం ఆయన తెలుగులో కథానాయకుడు రామ్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని