Ayushmann Khurrana: అలనాటి హీరోయిన్‌ను తలచుకొని పాట పాడిన ఆయుష్మాన్‌ ఖురానా - ayushmann khurrana posts video singing sridevis lamhe song on her 58th birth anniversary
close
Published : 13/08/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ayushmann Khurrana: అలనాటి హీరోయిన్‌ను తలచుకొని పాట పాడిన ఆయుష్మాన్‌ ఖురానా

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి శ్రీదేవి 58వ జయంతి సందర్భంగా బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా ఆమెను గుర్తు చేసుకున్నాడు. తన పాత వీడియోను ఒకటి సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ‘లమ్‌హే’ సినిమాలోని ‘కబీ మేన్‌ కహున్‌’ అనే పాటను స్వయంగా పాడిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి గిటార్‌ వాయిస్తుండగా.. ఖురానా ఆలపిస్తున్నట్లుగా ఉంటుంది. ‘లమ్‌ హే’ సినిమాలో ఈ పాటను లతా మంగేష్కర్‌, హరిహరన్‌ పాడారు. యశ్‌ చోప్రా 1991లో తెరకెక్కించిన చిత్రంలో శ్రీదేవి, అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆయుష్మాన్‌ ఖురానా అద్భుతంగా పాడతాడని అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ తన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా పోస్టు చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు కిషోర్‌కుమార్‌ జయంతి సందర్భంగా కూడా ఒక పాటను పాడి నెటిజన్లను అలరించారు. అతడి వ్యక్తిగత ఖాతాకు 14.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ కూడా ఉన్నారు. ఖురానా ప్రస్తుతం అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్న ‘డాక్టర్‌ జీ’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఖురానా సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించనుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని