ఎవరెస్టును అధిరోహించిన బెహ్రయిన్‌ ప్రిన్స్‌  - bahrain prince scales mt everests new height 1st foreign team to do so
close
Updated : 12/05/2021 06:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరెస్టును అధిరోహించిన బెహ్రయిన్‌ ప్రిన్స్‌ 

ఖాట్మండు: మొదటి సారిగా ఒక అంతర్జాతీయ బృందం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. బెహ్రయిన్‌ రాజకుమారుడు మహ్మద్‌ హమద్‌ మొహమ్మద్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంతో 16 మందితో కూడిన బెహ్రయిన్‌ రాయల్‌ గార్డ్‌ బృందం మంగళవారం ఉదయం ఈ ఘనత సాధించింది. ఎవరెస్టు శిఖరాన్న అధిరోహించిన తొలి అంతర్జాతీయ జట్టు ఇదేనని పర్యాటకశాఖ డైరెక్టర్‌ మీరా అచార్య వెల్లడించారు.  బెహ్రయిన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌లోని ఒక విభాగం రాయల్‌ గార్డ్‌ ఆఫ్‌ బెహ్రయిన్‌. ఈ బృందం 2020 అక్టోబర్‌లో నేపాల్‌లోని లొబుచే శిఖరం, మనస్లు శిఖరాలను అధిరోహించింది. 

2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపం తర్వాత నేపాల్‌ ప్రభుత్వం ఎవరెస్టు శిఖర ఎత్తును కొలవాలని నిర్ణయించింది. గతేడాది డిసెంబర్‌లో చైనా, నేపాల్‌ ప్రభుత్వాలు కలిసి ఎవరెస్టు శిఖరం ఎత్తను లెక్కగట్టాయి. 1954 నాటి లెక్కల కన్నా 86 సెంటీ మీటర్ల ఎత్తు పెరిగినట్లు వెల్లడించాయి. ఆ లెక్కల ప్రకారం ప్రస్తుత ఎవరెస్టు శిఖరం ఎత్తు 8,848.86 మీటర్లు. 

ఇదిలా ఉంటే.. ఎవరెస్ట్‌ సాహసయాత్రకు వెళ్లే వారు ఆక్సిజన్‌ ట్యాంకులను అక్కడే వదిలి వేయకుండా తమ వెంట తీసుకురావాలని నేపాల్‌ మౌంటెనీరింగ్‌ అసోసియేషన్‌(ఎన్‌ఎంఏ) అధికారులు కోరారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆక్సిజన్‌ ట్యాంకులు కరోనా బాధితులకు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని వెనక్కి తీసుకురావాలని సాహస యాత్రికులకు కోరినట్లు ఎన్‌ఎంఏ సీనియర్‌ అధికారి కాల్‌బహదూర్‌ తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని