TS News : ఈటలను పరామర్శించిన బండిసంజయ్‌ - bandi sanjay visits appollo hospital
close
Updated : 31/07/2021 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News : ఈటలను పరామర్శించిన బండిసంజయ్‌

హైదరాబాద్‌ :  మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈటల రాజేందర్‌ శుక్రవారం పాదయాత్రలో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన జులై 19న కమలాపూర్‌ మండలం నుంచి ‘ప్రజా దీవెన’ పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. అక్కడ ప్రసంగించిన అనంతరం ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఉన్న ఆయన నడవలేకపోయారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈటలకు బీపీ, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, షుగర్‌ లెవల్స్‌ పెరిగినట్లు తెలిపారు. దీంతో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. 
కోలుకున్న అనంతరం వాయిదాపడ్డ గ్రామం నుంచి ఈటల తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని