Oxygen: 2వేల కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తాం: బీసీసీఐ - bcci came forward to donate 2000 oxygen concentrators for covid relief
close
Published : 24/05/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen: 2వేల కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తాం: బీసీసీఐ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన వైద్యశాలలకు రాబోయే రోజుల్లో దశల వారీగా 2 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు (10 లీటర్ల సామర్థ్యం గలవి) అందజేస్తామని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ‘మునుపెన్నడూ లేని విధంగా ఈ కరోనా వైరస్‌ రెండో దశ.. దేశాన్ని తీవ్ర ప్రభావితం చేసింది. ముఖ్యంగా సరైన వైద్య సదుపాయాలు లేని, ఆక్సిజన్‌ కొరతను తెలియజేసింది. రాబోయే రోజుల్లో దశల వారీగా దేశవ్యాప్తంగా కాన్సన్‌ట్రేటర్లను అందజేస్తాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందిస్తూ వైరస్‌పై నిరంతరం పోరాడుతున్న వైద్య సిబ్బందిని కొనియాడారు. అందర్నీ కాపాడటానికి వారెంతో కష్టపడుతున్నారన్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బందే నిజమైన హీరోలని ప్రశంసించారు. ప్రజల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని, అందుకోసం అవసరమైన సహాయం చేస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. సెక్రటరీ జై షా స్పందిస్తూ తాము చేపట్టిన ఈ కార్యక్రమం దేశంలో ఆక్సిజన్ కొరతను కొంతైనా తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా చూశామని, భవిష్యత్‌లో ఈ పరిస్థితులు మారుతాయనే నమ్మకం ఉందన్నారు. అందరూ వాక్సినేషన్‌ తీసుకోవాలని సూచించారు. కష్ట సమయాల్లో బీసీసీఐ ముందుంటుందని, సామాజిక బాధ్యతగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు. కాగా, కరోనా తొలి దశ సమయంలోనూ బీసీసీఐ భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. పీఎం కేర్స్‌కు అప్పట్లో రూ.51 కోట్లు అందజేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని