ఈ లోకంలో క్రైమ్‌ చెయ్యనివారంటూ లేరు! - chehre official teaser
close
Published : 11/03/2021 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ లోకంలో క్రైమ్‌ చెయ్యనివారంటూ లేరు!

ముంబయి: బిగ్‌బీ అమితాబ్‌, నటుడు ఇమ్రాన్‌ హష్మీ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘చెహ్రే’. మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో అమితాబ్‌ లాయర్‌ పాత్ర పోషించగా మరో కీలక పాత్రలో ఇమ్రాన్‌ హష్మీ నటించారు. 

‘ఈ లోకంలో క్రైమ్‌ చెయ్యనివారంటూ ఎవ్వరూ ఉండరు’ అని వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ కథలోని గాఢతను తెలియజేస్తుంది. అలాగే చివరిలో అమితాబ్‌ ‘మన న్యాయస్థానాలు తీర్పులు మాత్రమే ఇస్తాయి, న్యాయాన్ని కాదు’ అంటూ చెబుతున్న డైలాగ్స్‌ ఆసక్తి రేపుతున్నాయి. ఏప్రిల్‌ 30 థియేటర్లోకి రానున్న ఈ చిత్రాన్ని రూమి జాఫ్రీ తెరకెక్కించగా మోషన్‌ పిక్చర్స్‌, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని