Corona: కరోనా పుట్టుకపై అమెరికాలోనూ పరిశోధించండి - china disease expert says covid-19 origins probe should shift to us: report
close
Published : 17/06/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కరోనా పుట్టుకపై అమెరికాలోనూ పరిశోధించండి

డిమాండ్ చేస్తున్న చైనా వైద్య నిపుణులు

షాంఘై: కరోనా వైరస్‌ పుట్టుకపై అమెరికాలోనూ దర్యాప్తు జరపాలని చైనా వైద్య నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. 2019 డిసెంబరు ప్రారంభంలోనే అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో ఏడుగురికి సార్స్‌-కోవ్‌-2 సోకిందంటూ అక్కడ ఓ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనీస్‌ డిసీజ్‌ కంట్రోల్‌ చీఫ్‌ ఎపిడెమాలజిస్ట్‌ జెన్‌ గువాంగ్‌  ‘గ్లోబల్‌ టైమ్స్‌’తో మాట్లాడుతూ.. కరోనా పుట్టుకపై చైనాలో చేసినట్లే ఇప్పుడు అమెరికాలో కూడా దర్యాప్తు చేయాలన్నారు. అమెరికాలో కరోనా వ్యాప్తి ప్రారంభంలో ఎందుకు తక్కువ టెస్టులు చేశారని ఆయన ప్రశ్నించారు. అంతే కాకుండా యూఎస్‌లోనే ఎక్కువ బయోలాజికల్‌ ల్యాబ్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజాన్‌ స్పందిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌కు సంబంధించిన మూలాలను అన్ని దేశాల్లో పరిశోధించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా వైరస్‌ మూలాల గురించి ఇప్పటికే అనేక వాదోపవాదాలు జరిగాయి. ఇది చైనా, అమెరికాకు మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. కరోనా మొదటికేసు నమోదైన వుహాన్‌లో ఉన్న వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఇప్పటికే అనేక సార్లు పరిశీలించారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ లీక్‌ అయిందని యూఎస్‌ జాతీయ ప్రభుత్వ ప్రయోగశాల తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈ నెల ప్రారంభంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది. కరోనా పుట్టుకపై ఇప్పటికే అనేక వదంతులు వచ్చాయి. గత సెప్టెంబరులోనే యూరోప్‌లో కరోనా కేసులు వచ్చాయని ఒక పరిశోధనలో తేలింది. కానీ, దీన్ని నిపుణులు బలపరచలేదు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని