జంతువుల్ని పెడితే, కాల్‌షీట్లు ఎగగొట్టవు - chinnappa thevar
close
Published : 24/06/2021 20:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జంతువుల్ని పెడితే, కాల్‌షీట్లు ఎగగొట్టవు

ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్నప్పదేవర్‌ చిత్ర నిర్మాత, శాండో, సుబ్రమ్మణ్యస్వామి భక్తుడు. కొన్ని చిత్రాలు నటులతో నిర్మించినా, ఎక్కువగా జంతువులతో తీశారు. ఏనుగులు, పాములు, పులులు, ఆవులు, పొట్టేళ్లు ఇలా. ‘‘జంతువుల్ని మచ్చిక చేసుకుని నటింపజేస్తే ఎంతో యోగ్యం. నా సినిమాలన్నీ ఘన విజయం సాధించినవే. పైగా ఇంకోటుంది. ప్రధాన ప్రాతల్లో జంతువుల్ని పెడితే, కాల్‌షీట్లు ఎగగొట్టవు. ‘అది కావాలి ఇది కావాలి’ అన్ని కోరికలు ఉండవు. చెప్పినట్టు వింటాయి. మనకి కావలసినట్టుగా నటిస్తాయి’’ అని చెప్పేవారు దేవర్‌. ఏనుగుని ప్రధాన పాత్రలో చూపించిన ‘హాథీ మేరీ సాథీ’ విదేశాల్లో కూడా ఘన విజయం సాధించింది.

దేవర్‌ ఆయా జంతువుల్ని పలకరించే విధానం. మాట్లాడే విధానం చిత్రంగా ఉండేది. ఎంతో ప్రేమ చూపించేవారు. ఆవుతో తీసిన ‘గాయ్‌ ఔర్‌ గౌరి’లోని ఆవుని ప్రేమాతిశయంతో చూసుకున్నారు. వాహిని స్టూడియోలో ప్రత్యేకం మంటపంలాంటి పెద్ద గది కట్టించి అందులో ఉంచారు. ఎండా వానా తగిలే ప్రసక్తి లేదు. దోమలు వాలకుండా పైన పెద్ద ఫ్యాను ప్రత్యేకంగా తయారు చేయించి పెట్టారు. ఎప్పటికప్పుడు శుభ్రపరచడానికి ఇద్దరు పనివాళ్లు ఉండేవారు. పొద్దున్నే వచ్చి రోజూ ఆవుని పలకరించి, మెడంతా దువ్వి బుద్ధులు చెప్పి వెళ్లేవారు. ‘‘ఇవాళ నీకు షూటింగు లేదురా కన్నా. హాయిగా విశ్రాంతి తీసుకో’’ అని చెప్పివేళ్లేవారు. ఆయన కంపెనీకి బ్యాంక్‌ ఖాతా లేదు. అంతా నగదే. ఆ నగదు ఇచ్చి రశీదు తీసుకునేవారు. సినిమా కొన్న వాళ్ల దగ్గరా డబ్బులే తీసుకునేవారు. ఏనాడూ, పైన చొక్కా వేసుకోలేదు ఒళ్లంతా చందనం పూసుకునేవారు. అలాగే విమానంలో బొంబాయి వెళ్లి వస్తూ ఉండేవారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని