సిక్కింలో ‘బిల్లా రంగా’ - chiranjeevi and moohanbabu going for a sikkim trip
close
Published : 15/03/2021 15:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిక్కింలో ‘బిల్లా రంగా’

వైరల్‌గా మారిన చిరు-మోహన్‌బాబు పిక్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటులు చిరంజీవి, మోహన్‌బాబు మంచి మిత్రులన్న విషయం అందరికీ తెలిసిందే. వృత్తి, వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న వీరిద్దరూ చాలాకాలం తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకుని వీకెండ్‌ ఎంజాయ్‌ చేయడానికి సిక్కిం వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు లక్ష్మి ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేసింది. ‘ఇద్దరు మ్యాస్ట్రోలు కలిసి సిక్కిం ట్రిప్‌కు వెళ్తే.. ఆ ప్రయాణం సూపర్‌గా ఉంటుంది. వీకెండ్‌ టూర్‌ కోసం సిక్కిం వెళ్లడానికి చిరు అంకుల్‌ నాన్నని ఒప్పించగలిగారు. నాకెంతో అసూయగా ఉంది(సరదాగా)! వారాంతంలో మీ ఇద్దరూ ఇలా కొంతసమయాన్ని గడపడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా హృదయం నిండింది. ఏదో ఒకరోజు పిల్లలందరం మీతో కలిసి వస్తాం’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘సిక్కింలో బిల్లా రంగా!! మీలో ఎంతమంది ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు?! చిరు అంకుల్‌ నాన్న కలిసి సరదాగా సమయాన్ని గడపడం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది’’ అని మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. చిరు-మోహన్‌బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘కిరాయి రౌడీలు’ వంటి చిత్రాలు అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మరోవైపు ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ పనుల్లో, మోహన్‌బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ షూట్‌లో బిజీగా ఉంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని