చిరు రేర్‌ వీడియో.. జగన్‌తో విష్ణు.. సుమ అల్లరి - cinema celebrities interesting social media posts on january 29th
close
Published : 30/01/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు రేర్‌ వీడియో.. జగన్‌తో విష్ణు.. సుమ అల్లరి

* తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి అరుదైన ఫొటోలతో కూడిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు చెప్పారు.

* మంచు విష్ణు, ఆయన సతీమణి వెరోనికా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్‌, ఆయన సతీమణి భారతితో కలిసి దిగిన సెల్ఫీని వెరోనికా పంచుకున్నారు. అందరూ కలిసి భోజనం చేసినట్లు చెప్పారు.

* యువ కథానాయకుడు అఖిల్‌ విహారయాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో షికారు వెళ్లిన ఫొటోను పంచుకుంటూ డాల్ఫిన్లను తనతో ఫొటో దిగేందుకు రమ్మంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

* వ్యాఖ్యాత సుమ అల్లరి చేస్తే మామూలుగా ఉండదు. ఉదయాన్నే తన సిబ్బంది ఒకరు నిద్రపోతుంటే ఆమెను సరదాగా ఆటపటిస్తున్న వీడియోను పంచుకున్నారు.

* రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* కథానాయిక అదాశర్మ తాను నటించిన తాజా వీడియోను వాళ్ల బామ్మకు చూపించారు. ఈ సందర్భంగా ఆమె స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఇలా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..














మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని