రెండురోజులపాటు టీకా పంపిణీ నిలిపివేత - covid 19 vaccination sessions not scheduled on saturday and sunday
close
Published : 26/02/2021 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండురోజులపాటు టీకా పంపిణీ నిలిపివేత

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: కరోనా వ్యాక్సిన్లు అందించే ప్రక్రియలో కీలకంగా పనిచేస్తున్న కోవిన్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసే ప్రక్రియలో భాగంగా శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీని నిలిపేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఫిబ్రవరి 27 శనివారం, ఫిబ్రవరి 28 ఆదివారాల్లో కోవిన్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేస్తున్నాం. దీంతో ఆ రెండు రోజులు వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నాం. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించాం.’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ తమ ప్రకటనలో పేర్కొంది.

దేశంలో జనవరి 16న ప్రారంభించిన అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25 వరకు 1,34,72,643 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ను అందించారు. అందులో 1,14,39,649 మందికి వ్యాక్సిన్‌ మొదటిడోసు, 20,32,994 మందికి వ్యాక్సిన్‌ రెండో డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదటిదశలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్లు అందించిన ప్రభుత్వం, మార్చి 1 నుంచి అరవైఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్లు అందిచనున్నట్లు ప్రకటించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని