టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు! - curfew lockdown should not affect vaccination
close
Published : 19/04/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు!

రాష్ట్రాలకు సూచించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, టీకా పంపిణీకి ఈ ఆంక్షలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆటంకం కలిగించవద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ.. వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది.

వ్యాక్సిన్‌ కేంద్రాల కోసం నిర్దేశించిన ఆసుపత్రుల్లో వాటి పంపిణీని నిరంతరాయంగా కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలను ఆదేశించింది. ఆయా ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ కోసం ప్రత్యేక గదులు/భవనాన్ని కేటాయించాలని సూచించింది. వ్యాక్సినేషన్‌ కోసం వచ్చే లబ్ధిదారులు అక్కడ కరోనా వైరస్‌ బారినపడకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారంతంలో పూర్తి లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, దిల్లీ, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, హరియాణా, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు, బిహార్‌ రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని