దిశా పటానిపై ప్రియుడు టైగర్‌ పొగడ్తలు - disha patani lifts 80 kg weights
close
Published : 08/07/2021 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిశా పటానిపై ప్రియుడు టైగర్‌ పొగడ్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెరపై నాజూగ్గా  కనిపించే హీరోయిన్లు బయట ఎన్నో వర్కౌట్లు చేస్తుంటారు. కటౌట్‌ కాపాడుకోవడానికి పాట్లు పడుతుంటారు. ఇంట్లో యోగాసనాలు వేస్తారు. జిమ్‌లో బరువులెత్తుతారు. అలాంటి ఫిట్‌నెస్‌ ప్రియుల్లో బాలీవుడ్‌ బ్యూటీ, నేషనల్‌ క్రష్‌ దిశా పటాని ముందువరుసలో ఉంటుంది. ఆమె నిత్యం వర్కౌట్లు చేస్తూ తన అభిమానులతో వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. అయితే.. ఈసారి ఆమె ఏకంగా 80 కిలోల బరువు ఎత్తి అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆ వర్కౌట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌ టైగర్‌ ష్రాఫ్‌తో పాటు అతని సోదరి కృష్ణష్రాఫ్‌ కూడా ఇంప్రెస్‌ అయ్యారు. తన ప్రేయసిపై టైగర్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు.. వాళ్ల తల్లి అయేషా ష్రాఫ్‌ కూడా స్పందించింది. తెలుగులో వరుణ్‌తేజ్‌ హీరోగా వచ్చిన ‘లోఫర్‌’ ద్వారా దిశా పటాని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇటీవల ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన ‘రాధే’లో సల్మాన్‌ఖాన్‌ సరసన కనిపించింది. వీటితో పాటు మరికొన్ని బాలీవుడ్‌ చిత్రాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని