కేజీఎఫ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్‌ చూశారా..? - exlusive still from KGF
close
Published : 08/12/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేజీఎఫ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టిల్‌ చూశారా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా అభిమానులకు కేజీఎఫ్‌ స్టార్‌ హీరో ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కేజీఎఫ్‌  ఛాప్టర్‌ చివరి షెడ్యుల్‌లో భాగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈక్రమంలో హీరో యశ్‌ ‌ సినిమాలోని ఓ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘అన్ని మంచి విషయాలు ఎప్పుడో ఒకసారి ముగిసిపోతాయి. ఇది కూడా చివరి షెడ్యుల్‌ కావచ్చు. కానీ.. విలన్‌ ఎప్పటికీ ఉంటాడు.. నా అభిమానుల కోసం కేజీఎఫ్‌2 నుంచి ఒక ప్రత్యేకమైన స్టిల్‌’ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశాడు.

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ ఘన విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌2’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ.. కరోనా.. వల్ల అది కుదరలేదు. అయితే.. లాక్‌డౌన్‌ తర్వాత పునఃప్రారంభమైన షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో ‘అధీర’ పాత్రను పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

ఇదీ చదవండి

సీత వచ్చేసింది.. క్లైమాక్స్‌ మొదలైంది..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని