కొవిడ్ టీకా: భేటీ అయిన నిపుణుల కమిటీ - expert committee meet on covid vaccine
close
Updated : 01/01/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్ టీకా: భేటీ అయిన నిపుణుల కమిటీ

దిల్లీ: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్‌ను దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టీకాల అనుమతుల అంశంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ శుక్రవారం కీలక సమావేశం చేపట్టింది. తమ వ్యాక్సిన్ల అత్యవసర వినయోగ అనుమతుల కోసం సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు చేసుకున్న దరఖాస్తులను ఈ భేటీలో విస్తృతంగా పరిశీలించనుంది. టీకాలపై సీరం, భారత్‌ బయోటెక్‌ నేడు కమిటీ ముందు మరోసారి ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నాయి. 

భారత్‌లో టీకా అత్యవసర వినియోగానికి సీరం, భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌ సంస్థలు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులపై నిపుణుల కమిటీ ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యింది. గతేడాది డిసెంబరు 9న జరిగిన సమావేశంలో వ్యాక్సిన్లపై అదనపు సమాచారం ఇవ్వాలని ఆయా సంస్థలను అడిగింది. సీరం, భారత్‌ బయోటెక్‌ ఆ వివరాలను కమిటీకి అందించగా.. ఫైజర్‌ మరింత సమయం కావాలని కోరింది. దీంతో ఫైజర్‌ దరఖాస్తును నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.

ఇక సీరం, భారత్‌ బయోటెక్‌ అందించిన అదనపు సమాచారాన్ని పరిశీలించేందుకు డిసెంబరు 30న భేటీ అయిన నిపుణుల కమిటీ.. మరింత లోతుగా చర్చించేందుకు శుక్రవారం మరోసారి భేటీ అయ్యింది. కాగా.. ఈ భేటీలో టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడానికి 90శాతం అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘టీకాపై శుభవార్తతో కొత్త ఏడాదిని మొదలుపెడతామేమో’ అంటూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ వ్యాక్సిన్‌ అనుమతులపై నిన్న సూచనప్రాయంగా చెప్పిన విషయం తెలిసిందే. అటు కొత్త ఏడాదిలో పెద్ద ఎత్తున టీకా పంపిణీ చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ కూడా అన్నారు. దీంతో నేటి భేటీలో ఏదో ఒక టీకాకు అనుమతులు లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో భారత్‌ అగ్రగామి

త్వరలో ‘మేడిన్‌ ఇండియా’ టీకా
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని