పాక్‌లో దేవాలయంపై దాడి.. 45 మంది అరెస్టు - forty five more arrested over attack on hindu temple in pakistan
close
Updated : 03/01/2021 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌లో దేవాలయంపై దాడి.. 45 మంది అరెస్టు

పేష్వార్‌: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ప్రావిన్స్‌లో హిందూ దేవాలయం కూల్చివేత కేసులో మరో 45 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 100కి చేరింది. మరో 350 మంది పేర్లను కూడా కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం రాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఓ హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. దీంతో  స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకొని యాంటీ టెర్రరిస్ట్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి మూడు రోజుల రిమాండ్‌ విధించింది.

మరోవైపు దేవాలయంతోపాటు స్థానిక ఓ హిందూనేత స్మారకాన్ని కూడా దుండగులు కూల్చివేశారు. కొన్ని రోజుల క్రితమే దీనిని వేరేచోట నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఓ వైపు విగ్రహాన్ని తరలించేందుకు అనుమతి ఉన్నప్పటికీ తమకు చెప్పకుండా కూల్చడంపై హిందూవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక జమైత్‌ ఉలేమా ఇస్లామ్‌ పార్టీకి చెందిన నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యను మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, హిందుత్వ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనపై భారత్‌ కూడా నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌ దౌత్యాధికారులు పాక్‌కు లేఖ రాశారు.

ఇవీ చదవండి..

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

రామతీర్థంలో భాజపా దీక్ష భగ్నంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని