‘ ఉద్యమ్‌ అభిలాష’తో నిరుద్యోగం తగ్గుతోంది..
close
Updated : 22/04/2020 04:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ ఉద్యమ్‌ అభిలాష’తో నిరుద్యోగం తగ్గుతోంది..

ఐఎస్‌బీ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని 115 జిల్లాల్లో అమలు చేస్తున్న ‘ఉద్యమ్‌ అభిలాష’ కార్యక్రమంతో నిరుద్యోగం 25 శాతం వరకూ తగ్గింది. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. అంతేకాకుండా.. ఎంతోమంది యువతీయువకులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారబోతున్నట్లు తేలింది. ఉద్యమ్‌ అభిలాష కార్యక్రమాన్ని సిడ్బీ (స్మాల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని 2018లో ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత యువతీయువకులకు వారు ఎంచుకున్న రంగాల్లో తగిన శిక్షణ ఇచ్చి, నిరుద్యోగాన్ని తగ్గించడంతోపాటు, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖకు చెందిన సీఎస్‌ఈ ఇ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియాతో చేతులు కలిపి సిడ్బీ దీన్ని అమలు చేస్తోంది. దీనివల్ల ఏ మేరకు ఫలితాలు వస్తున్నాయనే అధ్యయాన్ని ఇటీవల ఐఎస్‌బీ చేపట్టింది. కొంతమేరకు సానుకూలమైన ఫలితాలే సాధించినట్లు పేర్కొంటూ.. మరికొన్ని సూచనలనూ ఐఎస్‌బీ చేసింది. శిక్షణ తీసుకున్న వారిలో పని సామర్థ్యం బాగా పెరిగినట్లు, సగటున పది మందిలో 7.5మంది సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. 50శాతానికన్నా ఎక్కువ మంది రాబోయే ఆరు నెలల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవకాశముందని పేర్కొంది. అభ్యర్థులు శిక్షణకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటంతోపాటు, డిజిటల్‌ శిక్షణను ప్రోత్సహించాలని సూచించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త తరహా కోర్సులను అందించాల్సిన అవసరముందని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని