ఉద్యోగాల కోతలు ఉండవు
close
Updated : 21/09/2020 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగాల కోతలు ఉండవు

విస్తారా సీఈఓ లెస్లీ

దిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో వేతన కోతలపై సమీక్ష చేస్తామని, అయితే ఉద్యోగాల కోతలు మాత్రం ఉండవని విస్తారా సీఈఓ లెస్లీ తంగ్‌ పేర్కొన్నారు. విస్తారాలో ఎటువంటి ఉద్యోగ కోతలు లేవని, ఇంతకు ముందు ఉన్న దాదాపు 4000 మంది ఉద్యోగులు కొనసాగుతారని లెస్లీ స్పష్టం చేశారు.  కరోనా సంక్షోభం నేపథ్యంలో కార్యకలాపాలు నిలిచిపోవడంతో దేశీయ విమానయాన పరిశ్రమ కుదేలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు సైతం ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా వేతన కోతలు, లేఆఫ్‌లు వంటి చర్యలు చేపట్టాయి. ‘విస్తారాలో అన్ని ఉద్యోగాలను రక్షించుకునేందుకు వేతన కోతల ద్వారా వ్యయాలను తగ్గించుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాం. డిసెంబరు వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. జనవరిలో దీనిపై పునఃసమీక్ష చేస్తాం’ అని వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని