నా బాయ్‌ఫ్రెండ్ ఫిబ్రవరి 30లాంటోడు
close
Updated : 06/07/2020 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా బాయ్‌ఫ్రెండ్ ఫిబ్రవరి 30లాంటోడు

ముంబయి: సినిమాలు.. వీడియో ఆల్బమ్స్‌.. వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తూ యువతను ఆకట్టుకుంటున్న నటి ఊర్వశీ రౌటెలా. తను నటించిన ‘వర్జిన్‌ భానుప్రియ’ చిత్రం జూన్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా, లాక్‌డౌన్‌ కారాణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది. అయితే, తాజాగా ‘వర్జిన్‌ భానుప్రియ’ చిత్రం ప్రీమియర్‌ షో తేదీని వెల్లడిస్తూనే తనకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడా లేదా అనే విషయాన్ని కొంటెగా చెప్పింది.

‘‘నా బాయ్‌ఫ్రెండ్‌ ఫిబ్రవరి 30 లాంటోడు. అంటే నాకు అసలు బాయ్‌ఫ్రెండే లేడు’’అంటూ ఊర్వశీ తాజాగా తను దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఆ ఫొటోలో ఊర్వశీ లేత గులాబి రంగు స్వెటర్‌, నీలి రంగు జీన్స్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది. జులై 16న ‘వర్జిన్‌ భానుప్రియ’ చిత్రం ప్రీమియర్‌ షో ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదరించినందుకు ధన్యవాదాలు. ఐ లవ్‌ యూ’’ అంటూ ఫొటో కాప్షన్‌లో రాసుకొచ్చింది. ‘వర్జిన్‌ భానుప్రియ’ చిత్రానికి అజయ్‌ లోహాన్‌ దర్శకత్వం వహించారు. చిత్తరంజన్‌ భట్‌, రామ్‌జీ గులాటీ సంగీతం సమకూర్చారు. ధరివాల్‌ ఫిలిమ్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ ‘జీ5’లో విడుదల కాబోతోంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని