close
Published : 28/02/2021 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక బతుకే బస్టాండే

‘‘సింపుల్‌ గుండే లైఫు.. టెంపుల్‌ రన్‌లా మారే’’ అంటూ పెళ్లి తర్వాత తన బతుకు బస్టాండ్‌ అయిందని వాపోతున్నారు నితిన్‌. ఇప్పుడాయన కథానాయకుడిగా   నటించిన చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కీర్తి సురేష్‌ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. మార్చి 26న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్రం నుంచి ‘‘బతుకే బస్టాండ్‌’’ అనే గీతాన్ని విడుదల చేశారు. సినిమాలో కీర్తిని పెళ్లి చేసుకున్నాక.. తానెన్ని బాధలు పడాల్సి వచ్చిందో నితిన్‌ ఈపాటలో సరదాగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ గీతానికి శ్రీమణి సాహిత్యమందించగా.. సాగర్‌ ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని