స్త్రీ శక్తి అంటే ఏమిటో ‘నాట్యం’తో చూస్తారు
close
Published : 18/10/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్త్రీ శక్తి అంటే ఏమిటో ‘నాట్యం’తో చూస్తారు

- రామ్‌చరణ్‌

‘‘సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తాం. రెస్టారెంట్లు, బార్లు అన్ని చోట్లకు వెళ్తున్నాం. థియేటర్లకూ వెళ్దాం. మళ్లీ మన థియేటర్లకు పూర్వ వైభవం తీసుకొద్దాం’’ అన్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆయన తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘నాట్యం’ విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ నర్తకి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ తెరకెక్కించారు. రోహిత్‌, కమల్‌ కామరాజు, భానుప్రియ, ఆదిత్య మేనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకలో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘నాట్యం’ సినిమా చూశాను. ఆద్యంతం ఎంతో అద్భుతంగా ఉంది. నేను ఇండస్ట్రీ హిట్‌ సినిమాలని చూస్తున్నప్పుడు కూడా మధ్యలో పడుకుండిపోతాను. అలాంటిది నేను ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూశాను. సంధ్యారాజు నాట్యంపై.. ఇంత మంచి సినిమా తీస్తున్నారని తెలిసి సాయం చేసేందుకు వచ్చాను. స్త్రీ శక్తి అంటే ఏమిటో ఈ సినిమాతో చూడనున్నారు. ఇది నాట్యంకు సంబంధించిన చిత్రమే కాదు.. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం ప్రధాన   ఆకర్షణ’’ అన్నారు. ‘‘ఈ సినిమా వెనకాల సంధ్యా రాజుకు డ్యాన్స్‌ పట్ల ఉన్న ప్రేమ,   ఆరాధన కనిపిస్తోంది. ఈ సమయంలో ఇలాంటి కళాత్మక చిత్రాలు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు దర్శకురాలు నందిని రెడ్డి. చిత్ర నిర్మాత, నటి సంధ్యా రాజు మాట్లాడుతూ.. ‘‘మా గురువు వెంపటి చినసత్యం గారి వల్లే ఈరోజు నేనిక్కడ ఉన్నాను. రామ్‌ చరణ్‌ నాకు పదేళ్లుగా సాయం చేస్తూనే ఉన్నారు. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను. ఈ చిత్రం వెనకాల ఎంతో మంది శ్రమ ఉంది. మంచి మ్యూజిక్‌ ఇచ్చిన శ్రవణ్‌కు థ్యాంక్స్‌. కమల్‌కి క్లాసికల్‌ డ్యాన్స్‌ రాకున్నా.. ఏడాది  కష్టపడి డ్యాన్స్‌ నేర్చుకుని సినిమా చేశాడు’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా తీయడం కోసం ఇన్నేళ్లు ఎదురు చూశాను. చక్కటి తెలుగుదనం ఉన్న చిత్రం తీశానని ఆనందంగా ఉంది’’ అన్నారు చిత్ర దర్శకుడు రేవంత్‌. ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌ వర్మ, స్వప్నా దత్‌, శ్రవణ్‌ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని