ghani: పడ్డావో లేచావో నువ్వాగకూ... - Telugu news ghani Anthem Out now
close
Updated : 28/10/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ghani: పడ్డావో లేచావో నువ్వాగకూ...

గ్గేది నెగ్గేది లెక్కించకు... కొనసాగాలి ప్రస్థానం అంటూ దూసుకెళుతున్నాడు గని. మరి అతని లక్ష్యం ఏమిటో తెలియాలంటే ‘గని’ చూడాల్సిందే. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సయీ మంజ్రేకర్‌ నాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద  నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గని ఆంథెమ్‌ పేరుతో సినిమాలోని పాటని బుధవారం విడుదల చేశారు. ‘నీ జగజగడం వదలకురా కడవరకూ...  ఈ కదనగుణం అవసరమే ప్రతీ కలకు... నిన్నేంటి మొన్నేంటి నీకెందుకు, ఇవ్వాళే నీకు మైదానం...  పడ్డావో లేచావో నువ్వాగకూ, కొనసాగాలి క్రీడా ప్రస్థానం...’ అంటూ సాగుతుంది ఈ పాట. తమన్‌ స్వరకల్పనలోని ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించగా, ఆదిత్య అయ్యంగర్‌, సాయిచరణ్‌ భాస్కరుని, పృథ్వీచంద్ర ఆలపించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంకోసం వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా అమెరికా వెళ్లి తర్ఫీదు పొందారు. సునీల్‌శెట్టి, ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్‌,  ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని