చిరు సినిమాలో చెర్రీ..?
close
Published : 11/01/2020 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు సినిమాలో చెర్రీ..?

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తేజ్‌ ఒకేసారి వెండితెరపై కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘మగధీర’ చిత్రంలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించి మెప్పించారు. చిరు కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఖైదీనంబర్‌: 150’ సినిమాలోని ఓ పాటలో రామ్‌చరణ్‌ తన డ్యాన్సులతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి చిరు-చెర్రీ కలిసి వెండితెరపై సందడి చేయబోతున్నారట. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జంటగా త్రిష కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నటించనున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. తాజాగా ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ సినిమాలో చెర్రీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమా కోసం చెర్రీ 15 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చారట. ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని