‘థ్యాంక్యూ’ ఎవరికి చెప్పబోతున్నారు?
close
Published : 06/05/2020 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘థ్యాంక్యూ’ ఎవరికి చెప్పబోతున్నారు?

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నాగచైతన్య జోరుమీదున్నారు. వరుసగా రెండు సినిమాల్లో నటించబోతున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చేస్తున్న ఆయన, తదుపరి రెండు చిత్రాలకి పచ్చజెండా ఊపారు. అందులో ఒకటి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కనుంది. మరొక చిత్రానికి విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తారు.

ఈ రెండూ ఇంచుమించు ఒకేసారి చిత్రీకరణ జరుపుకోనున్నాయి. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘థ్యాంక్యూ’ అనే పేరు ప్రచారంలో ఉంది. బి.వి.ఎస్‌.రవి కథతో, దిల్‌రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. నాగ  చైతన్య - మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించబోతున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని