గుడ్‌న్యూస్‌ చెప్పిన రాహుల్‌ సిప్లిగంజ్‌
close
Published : 08/01/2020 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుడ్‌న్యూస్‌ చెప్పిన రాహుల్‌ సిప్లిగంజ్‌

హైదరాబాద్‌: బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వివాహం గురించి అనుకుంటున్నారా.. కాదండీ. ఆయన కొత్త ఇల్లు కొన్నారట. ఈ విషయాన్ని ఆయనే ఇన్‌స్టా వేదికగా తెలిపారు. రియాల్టీ షో తర్వాత అటు సినిమాల్లో పాటలు పాడుతూ.. ఇటు బయట స్పెషల్‌ ప్రోగామ్స్‌ ఇస్తూ చాలా బిజీగా గడుపుతున్న రాహుల్‌ ఇటీవల బెంజ్‌ కారును కొనుగోలు చేశారు. కారుకు సంబంధించిన ఫొటోలను సైతం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు.. సొంత ఇల్లు కొనుక్కోకుండా ఖరీదైన కారు ఎలా కొనుకున్నారంటూ కామెంట్లు పెట్టారు.

దీంతో రాహుల్‌ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. తాను చాలా రోజుల క్రితమే ఇల్లు కొనుగోలు చేశానని, ఆ తర్వాతే కారు కొన్నానని తెలిపారు. కనుక ఎవరూ టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు. ‘ఫ్లాట్‌ కొనేశా. అది రెడీ కావడానికి ఏడు నెలలు పడుతోంది. ఫ్లాట్‌ కొన్న తర్వాతే కారుకి గాలం వేశా. కనుక టెన్షన్‌ పడకండి. జస్ట్‌ చిల్‌’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో రాహుల్‌ వెండితెరకు నటుడిగా పరిచయం కానున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని