వాళ్లు నాకు కోట్లు ఆఫర్‌ చేశారు: అల్లు అర్జున్‌
close
Published : 11/01/2020 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లు నాకు కోట్లు ఆఫర్‌ చేశారు: అల్లు అర్జున్‌

కానీ నేను ఒప్పుకోలేదు..!

హైదరాబాద్‌: స్టేజ్‌ షోలలో నటించమని తనకు అనేక ఆఫర్లు వచ్చాయని కథానాయకుడు అల్లు అర్జున్‌ వెల్లడించారు. ఆయన నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్‌ ఓ ఆంగ్ల  మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో తాను చాలాసార్లు తిరస్కరించిన షో ఆఫర్ల గురించి ప్రస్తావించారు. ‘స్టేజ్‌ షో నిర్వాహకులు రూ. కోట్లలో పారితోషికం ఆఫర్‌ చేశారు. కానీ నాకు వాటిపై ఆసక్తి లేదు. అందుకే ఎప్పుడూ ఒప్పుకోలేదు. ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో వేదికపై నాకు తెలియకుండానే డ్యాన్స్‌ చేసేశాను. నేను ముందుగానే దీన్ని ప్లాన్‌ చేసుకోలేదు. అంతేకాదు అంత సేపు వేదికపై ప్రసంగిస్తానని కూడా అనుకోలేదు. అలా జరిగిపోయింది’ అని బన్నీ చెప్పారు.

‘అల వైకుంఠపురములో..’ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించాయి. టబు, సుశాంత్‌, సునీల్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ హిట్ల తర్వాత త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని