రజనీ కోసం పంపిణీదారుల ఎదురుచూపులు
close
Updated : 01/02/2020 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ కోసం పంపిణీదారుల ఎదురుచూపులు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘దర్బార్‌’. సంక్రాంతి కానుకగా గత నెల 9వ తేదీన చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరినట్లు లైకా సంస్థ ప్రకటించింది. కానీ ఈ సినిమాను తీసుకున్న పంపిణీదారులకు అంతగా కలెక్షన్లు రాలేదని ప్రచారం జరుగుతోంది. వాళ్లు నష్టాన్ని చవిచూసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పలువురు పంపిణీదారులు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను కలవడం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. రజనీకాంత్‌ను కలిసి పరిహారం అడగాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ వర్గాలు సినిమాకు సంబంధించిన లాభదాయకమైన చిత్రంగా చెబుతున్న తరుణంలో.. పంపిణీదారులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని