నితిన్‌కు సారీ చెప్పిన రష్మిక..
close
Published : 02/02/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌కు సారీ చెప్పిన రష్మిక..

నువ్వే నా ఫేవరెట్‌ అంటున్న నితిన్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటి రష్మిక నితిన్‌కు సారీ చెప్పారు. మరోవైపు రష్మికే తన ఫేవరెట్‌ అని అంటున్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భీష్మ’. రష్మిక కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో సెట్‌లో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నితిన్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘భీష్మ’ షూటింగ్‌ చివరి రోజు. నాకెంతో బాధగా ఉంది. అదే విధంగా ఇలాంటి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో నటించినందుకు గర్వంగా, సంతోషంగా ఉంది. కానీ, మా నుంచి ఇది చివరిది కాదు. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్ట్‌ కోసం మేమందరం కలిసి పనిచేస్తాం. లవ్‌ యూ వెంకీ కుడుముల. నీ గురించి చెప్పడానికి మాటలు చాలవు. కానీ ‘భీష్మ’ చిత్రాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలు. రష్మిక నువ్వే నా ఫేవరెట్‌. సినిమా కోసం ఎంతో కష్టపడి, నాకు సపోర్ట్‌ చేసినందుకు థ్యాంక్యూ. నీతో కలిసి మరోసారి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు నితిన్‌ పెట్టిన పోస్ట్‌పై రష్మిక స్పందించారు. ‘నితిన్‌.. ‘భీష్మ’ సినిమా షూటింగ్‌ నేటితో ముగిసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నీతో కలిసి ఈ సినిమా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాతో నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి అయ్యావ్‌. ఇంతకంటే గొప్పగా ఎక్స్‌ప్రెస్‌ చేయలేకపోతున్నాను అందుకు క్షమించు. కానీ నేనేమనుకుంటున్నానో నీకు తెలుసు.’ అని రష్మిక పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని