కొవ్వు కరిగించాలంటే జిమ్‌ అవసరం లేదు!
close
Updated : 28/03/2020 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవ్వు కరిగించాలంటే జిమ్‌ అవసరం లేదు!

అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

సినీ తారల వర్కౌట్‌ వీడియోలు

ఫిట్‌నెస్‌, పోషకాహారం, నిద్ర.. ఇవి ఆధునిక యుగంలో ఆరోగ్య మంత్రాలుగా మారాయి. చిన్న పిల్లల నుంచి వయసుపైబడిన వారి వరకు తమ జీవనశైలిలో వీటిని భాగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం ప్రత్యేకించి నటీమణుల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఓ విధంగా వారే తమ ఫాలోవర్స్‌కు ఆదర్శంగా ఉంటున్నారు. ఫిట్‌నెస్‌ కోసం చేసే కసరత్తులను సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ స్ఫూర్తిని నింపుతున్నారు. కరోనా నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉన్న ఈ తరుణంలో ఇంటిలోనే ఉంటూ వ్యాయామం చేయమని, రోగనిరోధక శక్తి పెంచుకోమని పిలుపునిస్తున్నారు. వ్యాయామం విధానాన్ని కూడా స్వయంగా వివరిస్తున్నారు. అలా మన తారలు పంచుకున్న ఫిట్‌నెస్‌ వీడియోలను చూసేద్దాం..

ఫిట్‌నెస్‌ అనగానే గుర్తొచ్చే కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కొవ్వు కరిగించాలంటే జిమ్‌ అవసరం లేదంటూ ఈ బ్యూటీ కసరత్తుల వీడియోను ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ‘ఎవరు చెప్పారు.. శరీరంలోని కొవ్వును కరిగించాలంటే జిమ్‌కు వెళ్లాలని. ఇప్పుడు మీ అందరికీ ఎంతో సమయం ఉంది. ఓ 30 నిమిషాలు ఇలా కసరత్తులు చేయండి. మీరు ఇంట్లో చేసిన వర్కౌట్స్‌ వీడియోను నాకు షేర్‌ చేయండి’ అని రకుల్‌ పేర్కొన్నారు.

ముద్దుగుమ్మ అమీజాక్సన్‌ ఇటీవల ఓ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. తల్లయిన తర్వాత అమీ బరువు పెరిగారు. ఆ తర్వాత కసరత్తులు చేసి బరువు తగ్గారు. మునుపటిలా నాజూకుగా మారారు. స్వీయ నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో ఇంటిలోని మెట్లను ఉపయోగించి ఎలా కసరత్తులు చేయాలో చూపిస్తూ వీడియోను షేర్‌ చేశారు.

హార్ట్‌ఎటాక్‌’ భామ అదా శర్మలో నటనతోపాటు అనేక కళలు ఉన్నాయి. ఆమె ఇప్పటికే ఫిట్‌నెస్‌, కరాటే చేస్తున్న వీడియోలు, పియానో వాయిస్తున్న వీడియోనుల పోస్ట్‌ చేశారు. ఇంటి పనిచేస్తే మన శరీరానికి ఎంతో వ్యాయామం లభిస్తుందంటూ తాజాగా అదా ఓ వీడియోను షేర్‌ చేశారు. స్వయంగా ఇంటి పనిచేస్తూ తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పించారు.

మిల్కీబ్యూటీ తమన్నా తన గార్డెన్‌లో యోగా చేస్తుండగా తీసుకున్న వీడియోను షేర్‌ చేశారు. ఆరోగ్యం కోసం కసరత్తులు చేయాలని సూచించారు. తన యోగా పోజులను అభిమానులతో పంచుకున్నారు. 

థానాయిక శిల్పా శెట్టి 25 ఏళ్ల వయసులో ఎలా ఉన్నారో.. ఇప్పుడు అంతే అందంగా కనిపిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే దీనికి కారణం అంటారామె. స్వీయ నిర్బంధంలో ఉన్న నేపథ్యంలో జిమ్‌ పరికరాలు లేకపోయినా ఇంట్లోనే చక్కగా వ్యాయామం చేయొచ్చని ఆమె అంటున్నారు. ఇంటిలోని మెట్లపై కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. వారంలో కనీసం నాలుగుసార్లు వ్యాయామం చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. అంతేకాదు స్వీయ నిర్బంధం సమయంలో ఇంటిలో పనిచేసే వారి విలువ తెలిసిందంటూ శిల్ప శుక్రవారం ఓ వీడియోను షేర్‌ చేశారు. తన గార్డెన్‌లో ఉన్న చెత్తను తోస్తూ, మొక్కలను నీరు పట్టారు. ఇది కూడా ఓ విధమైన కసరత్తేనని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్‌ సుందరి కత్రినా కైఫ్‌ ఇంట్లో ఉంటూనే తెగ కసరత్తులు చేస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే ఫిట్‌గా తయారు కావొచ్చని ఫాలోవర్స్‌కు సూచించారు. తను, ట్రైనర్‌ యస్మికా కరచియాలా వర్కౌట్‌ చేస్తున్న వీడియోలను పంచుకున్నారు. ఏ వర్కౌట్‌ ఎంత సమయం చేయాలి, ఎన్ని సార్లు చేయాలో వివరించారు.

టి సారా అలీ ఖాన్‌ కూడా స్వీయ నిర్బంధంలో ఉంటూనే ఇంకా ఫిట్‌గా తయారవుతున్నారు. లాక్‌డౌన్‌కు మద్దతు తెలుపుతానని, అదేవిధంగా ఫిట్‌నెస్‌ను వదలనని ఆమె ఇటీవల ఇన్‌స్టాలో వర్కౌట్‌ వీడియో షేర్‌ చేశారు. అందరూ ఫిట్‌గా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. తను చేసిన వర్కౌట్‌ వివరాల్ని షేర్‌ చేశారు.

థానాయిక కాజల్‌ తన నివాసంలోనే కసరత్తులు చేస్తున్నారు. తన తండ్రితో కలిసి వాకింగ్‌ చేస్తున్న వీడియోను ఆమె షేర్‌ చేశారు. ఇంటిలోనే నడవాల్సిన సమయం ఇదని పేర్కొన్నారు. అంతేకాదు స్వీయ నిర్బంధం నేపథ్యంలో తన సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి వర్కౌట్‌ చేశానని ఇటీవల మరో వీడియో షేర్‌ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపమని, పరిశుభ్రంగా ఉండమని కోరారు.

బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు యోగా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలుపుతూ వీడియోను షేర్‌ చేశారు. వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచే వర్కౌట్‌ ఇదేనంటూ పేర్కొన్నారు. యోగా తనకు చాలా ఇష్టమని, ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా దీన్ని చేయొచ్చని చెప్పారు. అంతేకాదు.. ‘ఇది సూర్య నమస్కారం.. 20 నిమిషాల్లో 20 సార్లు ఈ వర్కౌట్‌ చేయొచ్చు. ఇది గొప్ప వ్యాయామం. నేను 108 చేస్తా. యోగా మన జీవితాల్ని కాపాడుతుంది’ అంటూ మరో వీడియోను ఇటీవల ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

ముద్దుగుమ్మ రాశీ ఖన్నా సైతం ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేస్తున్నారు. స్వీయ నిర్బంధంలో కసరత్తులు అంటూ.. ఉష్ట్రాసనం పోజును షేర్‌ చేశారు. ఇది చాలా కష్టమని, శరీరం, మనసును ఒక్కచోటుకు చేరుస్తుందని తెలిపారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని