వైరల్‌గా మారిన ఎన్టీఆర్‌ ఫొటోలు 
close
Published : 15/04/2020 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరల్‌గా మారిన ఎన్టీఆర్‌ ఫొటోలు 

‘రామాయణం’కు 24 ఏళ్లు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ బాల నటుడిగా పూర్తి స్థాయి పాత్ర పోషించిన అపురూప దృశ్యకావ్యం ‘రామాయణం’. ఇతిహాసమైన రామాయణాన్ని చిన్నారులతో చూడచక్కగా తెరకెక్కించిన ఘనత దర్శకుడు గుణశేఖర్‌ సొంతం. అయితే ఈ సినిమా విడుదలై మంగళవారంతో 24 సంవత్సరాలైన సందర్భంగా ఇందులో ఎన్టీఆర్‌కు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రాముడిగా ఎన్టీఆర్‌ చూడచక్కని మోము చూసి నెటిజన్లు.. ‘అద్భుతం’ అని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎం.ఎస్‌. రెడ్డి నిర్మాతగా, గుణశేఖర్‌ దర్శకుడిగా వ్యవహరించిన ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్‌ రాముడిగా.. స్మితా మాధవ్‌ సీతగా మెప్పించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విపరీతమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఉత్తమ చిన్నారుల చిత్రంగా ఆ ఏడాది జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకుంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని