మహేశ్‌కి మోస్ట్‌ స్పెషల్‌ పర్సన్‌ ఎవరంటే..!
close
Published : 20/04/2020 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌కి మోస్ట్‌ స్పెషల్‌ పర్సన్‌ ఎవరంటే..!

ఫొటో షేర్‌ చేసిన సూపర్‌స్టార్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు‌ మహేశ్‌బాబు తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి సంబంధించిన ఫొటోను తాజాగా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. సోమవారం మహేశ్‌ తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా ఆమెకు విషెస్‌ తెలిపారు. తన తల్లితో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఏప్రిల్ ‌20!! నా జీవితంలోనే ఎంతో ముఖ్యమైన వ్యక్తికి సంబంధించి మరెంతో ప్రత్యేకమైన రోజు.. హ్యాపీ బర్త్‌డే అమ్మ’ అని మహేశ్‌ బాబు పేర్కొన్నారు.

సంక్రాంతి కానుకగా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేశ్‌ నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మెప్పించారు. ఇందులో మహేశ్‌కు జంటగా రష్మిక నటించారు. అయితే ఈసినిమా తర్వాత మహేశ్‌ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పరుశురామ్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుందని టాక్‌. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మహేశ్‌బాబు కథానాయకుడిగా ఓ సినిమాని తెరకెక్కించనున్నట్లు ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి ప్రకటించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని