కత్తి పట్టిన చేత్తోనే.. చీపురు పట్టిన ఎన్టీఆర్‌
close
Published : 21/04/2020 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కత్తి పట్టిన చేత్తోనే.. చీపురు పట్టిన ఎన్టీఆర్‌

రాజమౌళి విసిరిన ‘బి ద రియల్‌ మేన్‌’ ఛాలెంజ్‌ పూర్తి చేసిన తారక్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్ వెండితెరపై కత్తి పట్టి శత్రువులను నరకడం.. ఒంటిచేత్తో మట్టికరిపించడం, గుక్క తిప్పుకోకుండా సుదీర్ఘంగా డైలాగ్‌లు చెప్పడం చూసి అభిమానులు తెగ సంబరపడిపోయేవారు. కత్తి పట్టిన చేతితోనే ఇల్లు తుడిచే కర్రపట్టాడు.. రెండు చేతులతో గిన్నెలు శుభ్రం చేశాడు. చీపురు పట్టి రీల్‌ మ్యాన్‌ కాదు..రియల్‌ మ్యాన్‌ అనిపించుకున్నాడు. అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విసిరిన సవాల్‌ను 24గంటల్లోనే ఫినిష్‌ చేసేశాడు. 

‘ఉత్తమ పురుషుడెప్పుడూ ఇంటి పనులను పూర్తిగా భార్య భుజాలపైనే పెట్టడు. ఆమె ప్రతి పనిలో చేదోడు వాదోడుగా నిలుస్తాడు. ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఆమె కోసం ఇంటి పనికి, వంట పనికీ అండగా నిలిచేవాడే నిజమైన మగాడు’’ అంటూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘బి ద రియల్‌ మేన్‌’ పేరుతో ఓ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఇంటి పనుల్లో పాలుపంచుకుంటూ మహిళలకి సాయంగా నిలవాలన్నదే ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. రాజమౌళి దీన్ని పూర్తి చేయగా, ఆయన తారక్‌, రామ్‌చరణ్‌లను నామినేట్‌ చేశారు. ‘ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ జక్కన్న’ అంటూ సమాధానం ఇచ్చిన 24గంటల్లోనే తన ఛాలెంజ్‌ను పూర్తి చేశారు తారక్‌. ‘‘మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. పని పంచుకుంటే వచ్చే సరదానే వేరు.#BetheREALMAN’’ అంటూ ట్వీట్‌ చేశారు.

అంతేకాదండోయ్‌.. ఇంకో ట్విస్ట్‌ కూడా ఇచ్చారు. ‘బి ద రియల్‌ మేన్‌’ ఛాలెంజ్‌కు తన బాబాయ్‌ బాలకృష్ణతో పాటు అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు, దర్శకుడు కొరటాల శివను నామినేట్‌ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది. తమ అభిమాన కథానాయకుడు ఏం చేసినా స్టైల్‌గా ఉంటుందంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా దీన్ని షేర్‌ చేస్తున్నారు. మరి తారక్‌ విసిరిన ఛాలెంజ్‌ను టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లాంటి అగ్ర కథానాయకులు ఎలా ఫినిష్‌ చేస్తారో చూడాలి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని