శ్రుతిహాసన్‌, రకుల్‌ ఏం మిస్‌ అవుతున్నారంటే..
close
Published : 31/05/2020 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రుతిహాసన్‌, రకుల్‌ ఏం మిస్‌ అవుతున్నారంటే..

ఫొటోలు పోస్ట్‌ చేసిన తారలు

హైదరాబాద్‌: ప్రపంచదేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా ప్రజల జీవన స్థితిగతుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జనసమూహాంలోకి వెళ్లాలన్నా, బయట వస్తువులను తాకాలన్నా ప్రజలు చాలా భయపడుతున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలతోపాటు పలువురు సినీ తారలు సైతం జనసమూహాలను, ఇష్టమైన ఆహారాన్ని ఎంతగానో మిస్‌ అవుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో తాము షూటింగ్ సెట్స్‌ను మిస్‌ అవుతున్నామని వెల్లడించిన కొంతమంది తారలు తాజాగా తమకు ఎంతో ఇష్టమైన వంటకాలను, ప్రదేశాలను మిస్‌ అవుతున్నామని తెలిపారు.

ఎలివేటర్‌ వాల్స్‌: శ్రుతిహాసన్‌

కథానాయికగానే కాకుండా సింగర్‌గాను ప్రేక్షకులను అలరించారు నటి శ్రుతిహాసన్‌. పియోనో, తన పెంపుడు పిల్లితో ఆమె లాక్‌డౌన్‌ సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా ఆమె తన మిస్సింగ్స్‌ గురించి వివరించారు. ‘జన సమూహాలను మిస్‌ అవుతున్నా. అందరి ఎదుట పాట పాడడాన్ని మిస్‌ అవుతున్నా. ఎలివేటర్‌ వాల్స్‌ను ముట్టుకోవడాన్ని మిస్‌ అవుతున్నా’ అని శ్రుతిహాసన్‌ తెలిపారు.

హైదరాబాద్‌, దోశ: రకుల్‌

క్వారంటైన్‌ లైఫ్‌లో సోదరుడితో కలిసి సంతోషంగా జీవిస్తున్నారు నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌. డైలీ వర్కౌట్లు, టీవీ, గేమ్స్‌తో రోజువారీ జీవితం గడుస్తోందని ఆమె ఇప్పటికే చాలాసార్లు తెలిపారు. తాజాగా ఆమె హైదరాబాద్‌, దోశను మిస్‌ అవుతున్నానన్నారు. అందుకే ఇంట్లోనే దోశను సిద్ధం చేయించుకున్నానన్నారు.

దక్షిణాది వంటకాలు: కాజల్‌

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన కాజల్‌ చెఫ్‌గా మారారు. విభిన్నమైన కేక్స్ తయారు చేసి కుటుంబసభ్యుల నోటిని తీపి చేస్తున్నారు. ‘మూవీ సెట్స్‌ చాలా ఎక్కువగా మిస్‌ అవుతున్నా. అందుకే ఆంధ్రా భోజనాన్ని తయారు చేశాను. ఈ వంటకాలను తయారు చేయడంలో నేను పాసయ్యానని అమ్మవాళ్లు చెప్పారు. (నాకెంతో ఇష్టమైన బెండకాయ పులుసు, సోరకాయ పచ్చడి, పెసరట్టు తయారు చేశాను)’ అని కాజల్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని