ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
close
Updated : 04/06/2020 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?

ఆనాటి ఫొటో షేర్‌ చేసిన నటి

హైదరాబాద్‌: చూడచక్కని రూపం.. చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? చిన్నతనంలోనే మ్యాగజైన్‌ కవర్‌లో మెరిసిన ఈ ముద్దులొలికే చిన్నారి మరెవరో కాదు నటి రష్మిక. ప్రస్తుతం షూటింగ్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన రష్మిక సోషల్‌మీడియా వేదికగా తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె తన మొట్టమొదటి మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘2001లో నా మొట్టమొదటి మ్యాగజైన్‌ కవర్‌ షూట్‌ ఇది! మ్యాగజైన్‌ కవర్‌ కోసం ఆ రోజు జరిగిన ఫొటో షూట్‌ను ఇప్పటికీ మర్చిపోలేదు! ఈ మ్యాగజైన్‌తోపాటు ఇప్పటి వరకూ నా ఫొటోతో వచ్చిన ప్రతి పత్రికను అమ్మ దాచిపెట్టింది. మీ ప్రేమాభిమానాలు పొందుతూ ఈ స్థాయికి ఎదుగుతానని భావించలేదు. ఆశ్చర్యంగా ఉంది. నా జీవితంపట్ల సంతోషంగా ఉన్నాను. మనం చేసే ప్రతి యుద్ధం, మనం సాధించే ప్రతి అవకాశం, కుటుంబం, స్నేహితులు, కోస్టార్స్‌ ఇలా అందరిపై నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి’ అని రష్మిక పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని