మాకు భద్రత కల్పించండి: కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు
close
Published : 15/03/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాకు భద్రత కల్పించండి: కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు తమకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కోరారు. ఈ మేరకు వారు గవర్నర్‌కు మెయిల్‌ ద్వారా లేఖ పంపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు శనివారం మీడియాకు వెల్లడించాయి. ‘మేము భద్రతా కారణాల దృష్ట్యా భోపాల్‌కు రాలేకపోతున్నాం. మేము క్షేమంగా భోపాల్‌ చేరుకునేందుకు భద్రత కల్పించాలి’అని లేఖలో గవర్నర్‌ను కోరారు. వాస్తవానికి ఎమ్మెల్యేలంతా శుక్రవారమే భోపాల్‌కు వచ్చేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ అప్పటికే భోపాల్‌లో భాజపా, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందనే విషయం తెలుసుకుని భయంతో వెనుకడుగు వేశారు. వెంటనే తాము భోపాల్‌కు రావడానికి భద్రత కల్పించాలంటూ గవర్నర్‌కు లేఖ పంపారు. 

ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరుకు తరలిన విషయం తెలిసిందే. వారంతా కాంగ్రెస్ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులని సమాచారం. సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వెంటనే వారంతా తమ పదవులకు రాజీనామా చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని