మేం చెప్పిందే నిజమైంది : పవన్‌
close
Published : 15/03/2020 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేం చెప్పిందే నిజమైంది : పవన్‌

రాజమహేంద్రవరం : ప్రభుత్వానికి కొమ్ముకాసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం వైఖరి ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస, దౌర్జన్యాలపై తాము చెప్పినవే నిజమయ్యాయని పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన నేపథ్యంలో రాజమహేంద్రవరంలో పవన్‌ మీడియాతో మాట్లాడారు.

‘నామినేషన్ల సమయంలో పలుచోట్ల దాడులు చేశారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఈ సారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి. లేకుంటే న్యాయస్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింస, దౌర్జన్యాలపై నివేదికలు తయారు చేస్తున్నాం. తప్పులు చేసిన అధికారులపై నివేదికను కేంద్రానికి పంపిస్తాం. కేంద్రహోంశాఖకు కూడా లేఖ రాస్తున్నాం. అధికారులపై నివేదికను దిల్లీ వెళ్లి సీఈసీకి అందిస్తా. ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో.. నామినేషన్ల ప్రక్రియ కూడా మళ్లీ కొత్తగా ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం’ అని పవన్‌ కోరారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని